పుట:Aananda-Mathamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియైదవ ప్రకరణము

181


గా పోయెను, కేప్ట౯ థామసు సహకారి యగు లెప్టినెంటు వాట్స౯ అనునతఁడు దూరముగ నుండి యొక గుంపు సంతానులు మెల్లగా పోవుచున్నారని తెలిసికొని, యతఁ డొక గుంపు ఫౌజుదారీ సిపాయీలను, ఒక గుంపు దేశీయ రాజుల సిపాయీలను దీపికొని జీవానందుని వెన్నంటెను.

దీనిని కేష్ట౯ థామసు చూచెరు, చాలమంది సంతానులు పాఱిపోవుటను గని యతఁడు కేప్ట౯ హేయను నతనిం జూచి, “ నేను ఇన్నూఱు మున్యూఱుగురు సిపాయీలను తీసికొనిపోయి మిగిలియున్న రాజ ద్రోహులను జంపి వేసెదను. నీవు ఫిరంగులను, మిగిలిన సైన్యమును దీసికొని వారి వెంబడి పరుగిడుము. వాట్సన్ ఎడమ ప్రక్కగా పోవుచున్నాఁడు, నీవు కుడివైపుగా పో. ఇట్లు మూడు ప్రక్కలయందును వారినిఁ జుట్టుకొంటి మేని వలలోఁ జిక్కిన పక్షులవలే మనచేతిలోఁ బడుదురు. అపుడు వారిని చంపి వేయవచ్చును. వారు ద్రుతపదులగు దేశ్య జనులు; అందటికంటెను పరుగెత్తుటయందు దక్షులు; నీవు వారినిఁ బట్టఁజాలవు. కావున, సవారులను దీసికొనిపోయి యడ్డపడి ఆనకట్టపై నిలుచున్న యెడల కార్యము సాధింపవచ్చు” నని చెప్పెను 'కేష్ట౯ హే అట్లు చేసెను.

“ఆతిదర్పే హతా లఙ్కా"—— కేప్ట౯ థామసు సంతానులను అలక్ష్యముగాఁ దలఁచి యిన్నూఱుగురు పదాతులను మాత్రము భవానందునితోఁ బోరుట కుంచుకొని మిగిలిన సైన్యమును హేతోఁ బంపెను. చతురుఁ డగు భవానందుఁ డాంగ్లేయ ఫిరంగి సైన్యమంతయు వెడలిపోయి స్వల్పజనమే మిగిలి యుండినను, వారిని విడువఁగూడ దని తలంచి, హతశేషు లైన