పుట:Aananda-Mathamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము

169


యక నేను హెచ్చుగా నీడ్చితిని. నీవు నాకన్నను జ్ఞానివి; దీనికి ఉపాయమును నీవు చేయుము; జీవానందునితో నాకీ యుదంతము దెలియు నని చెప్పవద్దు; నీ యందలి ప్రేమ చేత వాఁడు ప్రాణముతో నున్నాఁడు. ఇంక ను ప్రాణము నుంచి కొని యున్నాఁడు. అపుడే నాకార్యోద్దార మగును.

ఆ విశాలమైన నీలోత్ఫుల్లలోచనములచే నిదాఘ కాదంబినీ విరాజిత విద్యుత్తుల్లమైన రోష విశిష్ట కటాక్షము నిగుడించి, “ఏమి, ప్రభూ! నేనును నాస్వామియు నేకాత్ములము, నేను తమతో నే మేమి మాటలాడితినో వానిని అతనికి జెప్పెదను; అతఁడు చావవలయు నన్నచోఁ జచ్చును; నాకేమి నష్టము ? నేనును జచ్చెదను; అతనికి స్వర్గము ఘటించినచో నాకును స్వర్గము ఘటించును.” అనెను.

బ్రహ్మచారి—— నే నెపుడును ఎవ్వరితోను ఓడి పోలేదు; నేఁడు నీతో నోడితిని; తల్లీ! నేను నీకుమారుఁడను; సంతానునిపైఁ బ్రేమ నుంచుము; జీవానందుని ప్రాణరక్షణ సేయుము; నా కార్యోద్దారమగును, అనెను ఇప్పు డామేముఖ మనెడి మెఱుము మెఱసెను. (అనఁగా నవ్వెను.)

శాంతి——నా స్వామియొక్క ధర్మము అతని చేతియందున్నది. నే నేల అతనిని ధర్మచ్యుతునిగాఁ జేయవలయును? ఇహమందు సతికి పతియే దైవము. అయినను, పరలోకంబున నందఱకును ధర్మమే దైవము. నాకు నాపతి పెద్దవాఁడు.అతనికంటెను నా స్వధర్మము పెద్దది, దానికంటెను నాపతి ధర్మము పెద్దది. నా కిష్టము వచ్చినపుడు నాధర్మమునకు తిలోదకము విడిచెదనుగాని, నాస్వామి ధర్మంబును విడువను, మీరు