పుట:Aananda-Mathamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

ఆనందమఠము


నన్నుఁ బిలిచిరో; ఏదియు దెలియ లేదు. పుణ్యమయి వగునో యనంతా! నీవు శబ్దమయివి, నీశబ్దమర్మమును నేఁ దెలిసికొనఁ జాలను. నాకు ధర్మమున బుద్ధి నిమ్ము, నన్ను పాపరహితునిఁగాఁ జేయుము. ఓగురునాథా! ధర్మమునందు నా బుద్ధిని బ్రవేశింపఁ జేయుము” అని చెప్పెను.

అప్పు డాభీషణ మైన యరణ్యమధ్యమునందు, అతిమధురమును గంభీరమును మర్మ భేదియు నగు మనుజుని కంఠస్వ రము వినవచ్చెను. “ధర్మమున నీబుద్ధి యుఁడునుగాక, దీవించితి” నని చెప్పినట్లు వినఁబడెను.

భవానందుని శరీరము రోమాంచ మాయెను. “ఇదేమిది? ఇది గురునాథుని కంఠధ్వని, మహాస్వామీ! తా మెచ్చట నున్నారు? ఈసమయమున దాసునికి దర్శన మొసంగి రక్షింపుడు.”

ఆయినను, ఎవ్వరును దర్శన మియ్య లేదు, ఎవ్వరును ఉత్తర మియ్య లేదు. భవానందుఁడు మరల ఉత్తరము రాలేదని యనుకొని యచ్చ టచ్చట వెదకెను. ఎవ్వరును లేరు. అట్లే రాత్రిగడచెను. అనంతరము ప్రాతస్సూర్యుడుదయించి, యరణ్యశిరంబున నుండిన శ్యామల పత్ర రాశిని ప్రకాశింపఁ జేయుచుండెను. వెఁటనే భవానందుఁడు బయలుదేఱి మఠము. నకుఁ బోయెను. “హరే మురారే హరే మురారే” యను శబ్దమును వినెను, అది సత్యానందుని కంఠముగా నుండెను. కావున సత్యానందుఁడు అడవినుండి మరలివచ్చిరని తెలిసి కొనెను.