పుట:Aananda-Mathamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

163


ణము పోవుచున్న దే? ఛీ! ఛీ! నాగొంతు గాయ మాయెను.(వాస్తవముగా ధీరానందుని మెడనుండి రక్తము కాఱుచుండెను.)

భవానంద—— నీవు నాకధర్మమును బోధించుటకు వచ్చితివా యేమి? నీకేమో స్వార్థ ముండవలయును.

ధీరానంద—— దానినే చెప్పుట కిష్టము కలవాఁడనై యున్నాను కత్తిని నొక్క కుము చెప్పెదను ఈ సంతానధర్మము నందు ఎముక లెల్ల పొడి యగుచున్నవి. నేను దీనిని పరిత్యజించి యాలు బిడ్డల ముఖమును జూచికొని కాలహరణము చేయవలయు నని మిగుల నాతురుఁడనై యున్నాను. నే నీ సంతానధర్మమును విడిచి పెట్టుదును. అయిన, నింట గూర్చుండి చేయున దేమి? నేను విద్రోహి నని యందఱును దెలిసికొని యున్నారు. ఇంటికి: బోయి కూర్చుండినను రాజభటులు వచ్చి తల నఱికి తీసికొని పోదురు. లేనియెడల, సంతోనులే నన్ను విశ్వాసఘాతుకుఁడనని నఱికి వేయుదురు. కావున, నిన్నును నా మార్గమునకుఁ దీసికొనుట కిష్టము కలవాడనై యున్నాను.

భవానంద——నన్ను నేల?

ధీరానంద——ఇది ముఖ్యమైనమాట. ఈసంతానసైన్యము నీయాజ్ఞాధీనము. సత్యానందుఁ డిప్పు డిచ్చట 'లేఁడు. నీవే వారికి నాయకుఁడవు. నీ వీసేనను గొనిపోయి యుద్ధము చేయుము. నీకు జయము కలుగు నని నాకు దృఢమైన నమ్మకము కలదు. యుద్ధమునందు జయ మైనచో నీ సొంత పేరుతో రాజ్యస్థాపన జేయుము. సైన్యము నీ స్వాధీనమై యున్నది. నీవు రాజగుము—— కల్యాణి నీకు మండోదరి కానిమ్ము. నేను నీ యను