పుట:Aananda-Mathamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరవము

161


ధీరానంద——నిన్ను వెదకుచు.

భవానంద——ఏల ?

ధీరానంద——ఒకమాట చెప్పుటకు.

భవానంద——అదేమి మాట.

ధీరానంద——నిర్జనస్థలమునఁ జెప్పఁదగినది.

భవానంద——ఇచ్చటనే చెప్పుము. ఇట నెవ్వరును లేరు.

ధీరానంద——నీవు నగరంబునకుఁ బోయి యుంటివా ?

భవానంద——ఔను.

ధీరానంద—— గౌరీ దేవి యింటికా?

భవానంద——నీవును నగరంబునకే పోయియుంటివా ఏమి?

భవానంద——అచ్చట నొక పరమసుందరియైన వనిత నివసించుచున్నది కాదా?

భవానందుఁడు, కొంచె మాశ్చర్యపడి భయభ్రాంతుఁడై——ఇదేమి మాట? యనెను.

ధీరానంద——నీవు దానిని చూచితివి గదా ?

భవానంద——ఆతర్వాత.

ధీరానంద——నీ వాయువతియం దనురక్తుడవై యున్నావా?

భవానంద——(కొంచెము ఆలోచించి) ధీరానందా ! ఈ యన్వేషణ మేల ఘటించెను ! నీవు చెప్పిన దంతయు నిజమే. నీవు దక్క ముఱెవ్వ రెఱుఁగుదురు?

ధీరానంద——ఎవ్వరు నెఱుఁగరు,

భవానంద——అట్లయినపుడు నిన్ను గొట్టి చంపి నేను కళంక ముక్తుడను కావచ్చును కదా ?