పుట:Aananda-Mathamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది తొమ్మిదవ ప్రకరణము

157


కల్యాణి——నాబిడ్డ సుకుమారి యెట్లున్నదో, తెలియునా?

భవానంద——చాల దినములనుండి ఆ సమాచారము తెలియ లేదు. జీవానందుని నేను జూడ లేదు. అతఁడు నేనుండు దిక్కున పోలేదు.

కల్యాణి——ఆబిడ్డ సమాచారమును దెలియఁ జేయలేవా? స్వామి నాకుఁ ద్యాజ్యము నేను ప్రాణముతో నున్న దానను గాన బిడ్డ నేల త్యాజ్యము చేయవలయును? ఇప్పటికిని సుకుమారి కనఁబడినచో నామనమునకు కొంచెము శాంతి కలుగును——నాకొఱకై యింతమాత్రము చేయరాదా?

భవానంద——చేయుదును, కల్యాణీ! నీ బిడ్డను బిలిచికొని వచ్చి విడిచెదను, తర్వాత ?

కల్యాణి——తర్వాత నేమి ?

భవానంద——స్వామి ?

కల్యాణి——నా మనఃపూర్వకముగాఁ ద్యజించినాను.

భవానంద——అతనివ్రతము సాంగ మైన పిదప?

కల్యాణి——అప్పుడు అతనిదాన నౌదును. నే బ్రతికి యుండుట యతనికి దెలియునా?

భవానంద—— తెలియదు.

కల్యాణి——నీ వతనిని జూడ లేదా ?

భవానంద——చూచినాను.

కల్యాణి——నన్ను గూర్చి ప్రస్తావన చేయ లేదా ?

భవానంద——లేదు; చచ్చిపోయిన భార్యకును మగనికిని యేమి సంబంధము ?

కల్యాణి——ఏ మనుచున్నారు ?