పుట:Aananda-Mathamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ఆనందమఠము


చేయుచుండెను. అచ్చటికిఁబోయి భవానందమహా ప్రభువు దర్శన మొసంగెను. ఆయాఁడుది యర్ధవయస్కురాలును, నల్లని యాకారమును, బలిసినశరీరమును గల్గి, ఎఱ్ఱచీరెనుధరించి యుండెను. చెక్కిళ్లపై పచ్చ పొడిపించుకొని యుండెను. సీమంత ప్రదేశమున కేశ దామము చూడాకారముగ శోభిల్లుచుండెను, గరిటెను తపెలయం దుంచి "రణరణ” శబ్దము చేయుచుఁ ద్రిప్పుచుండెను. అలకావళి కేశగుచ్ఛ మటునిటు నెగురుచుండెను. తనలో దానే యే మేమో చెప్పుచుండెను. ఆమె ముఖభంగి వికారమైనపు డంతయు తలమీఁది చూడాకారమైన ముడి నానాప్రకారములుగ నల్లాడుచుండెను, ఇట్టిసమయమున భవానంద ప్రభువు ప్రవేశించెను. ప్రవేశించి, 'ఏమి, ఠాకూరాణీ ! లేచి రా! నమస్కరించెద' ననియెను.

ఠాకూరాణి భవానందునిఁ గాంచి, భయంపడి, చీరెను. సవరించికొనుట కారంభించెను, మస్తకమున నున్న చూడాకార మగు ముడిని విప్పవలయు నని యిష్టము. అయినను. అనుకూల పడ లేదు. ఏలన, చేతిలో గరిటె యుండినదేగాక చేయిని కడిగి కొనలేదు. నూనెచే మసృణమైన యా చికురుజాలమునందు, అయ్యో ! అందులో పూజాసమయమున నొక వకుళ పుష్పము చిక్కుకొని యుండెను. చెఱఁగుతో మూయుటకు యత్నించెను. అదియు సాధ్యము కాలేదు. ఏల? ఆ ఠాకూరాణీ యైదుమూరల బట్టనే కట్టుకొని యుండెను. ఆ యైదుమూరల గుడ్డ మొదట గురుభార ప్రణత మైన యుదర ప్రదేశమును జుట్టుకొని వచ్చుటలోనే చాలవఱకు సరిపోయినది. ఆమీఁద మిగిలినగుడ్డ దుస్సహభారగ్రస్త హృ