పుట:Aananda-Mathamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువ దేడవ ప్రకరణము

145


సన్యాసి—— నేను సన్యాసిని.

కేప్ట౯——నీవు (Rebel) (రాజద్రోహివి).

సన్యాసి——అట్లనఁగా నేమి?

కేష్ట౯—— నేను నిన్ను గుండుతోఁ గాల్చెదను.

సన్యాసి——కాల్చుము.

కేష్టను తన మనస్సులో కాల్చి వేయుదునా? వద్దా ? అని యాలోచించుచుండునంతలో, మెఱుము వేగమువలె యా నవీనసన్న్యాసి వానిపైఁబడి చేతియం దుండిన తుపాకిని లాగు కొనెను. సన్న్యాసి వక్షావరణచర్మమును లాగివేసెను. మీస మును గడ్డమును పీకి పాఱవైచెను. థామసు చూచుచుండగనే యొక యపూర్వమగు సుందర స్త్రీమూర్తిగా నిలిచెను, సుందరి చిరునగవుతో, 'దొరగారూ ! నే నాఁడుదానను ఎవ్వరిని తొందర పెట్టను; హిందువులకును తురకలకును ఘోర రణము జరుగుచుండఁగా, మధ్య మీ రేల రావలయును? మీరు ఇంటికి మరలి పొండు' అనియెను.

థామస్—— నీ వెవరు?

శాంతి——చూడుము , నేనాఁడుదానను ఎవరితోఁ బోరుటకై నీవు వచ్చి యున్నాఁడవో వారిలో నే నొక్కని భార్యను.

థామస్—— నీవు నాగుఱ్ఱము పైఁ గూర్చుందువా?

శాంతి—— ఏల? నీకు ఉపపత్ని నగుటకా?

థామస్——యజమానురాలుగా—— అయినను పెండ్లి చేసి కొనను.

శాంతి—— నేను, జెప్పవలసిన దొకటి యున్నది. మాయింటియం దొక అందమైన కోఁతి యుండెను; అది చచ్చిపోయెను.