పుట:Aananda-Mathamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

ఆనందమఠము


వేయుదు నని తలంచుకొనెను. ఒక్కనాఁడు జగదీశ్వరుఁడు సింహాసనాసీనుఁడై నిస్సందేహముగా “తథాస్తు” అనెను. అయి నను, ఆ దినము దూరముగా నుండెను. సంతానులభీషణమగు హరిధ్వనికి వార౯ హేస్టింగ్సుకూడా కంపితుఁ డాయెను.

వార౯ హేస్టింగ్సు మొదట పౌజుదారి సైన్యమువలన సంతానుల రాజవిద్రోహము నణఁగింపఁ బ్రయత్న పడెను, అయినను, ఫొజుదారి సిపాయీలవ్యవస్థ చాల చెడిపోయి యొకముసలిదాని నోటనుండి హరినామము వినినను భయపడి పాఱిపోవునట్టి స్థితిలో నుండెను. కావున వారన్ హేస్టింగ్సు నిరుపాయుఁడై దక్షుఁడగు కేఫ్ట౯ థామస్ అనునొక సైనికుని యధినాయకునిగాఁ జేసి కంపెనీసైన్యమును విద్రోహనివారణార్థమై వీరభూమి ప్రదేశంబున కంపెను.

కేష్ట౯ థామసు వీరభూమినిఁ జేరి, యచటరాజవిద్రోహ నివారణ విషయమై యత్యుత్తమములైన యేర్పాట్లు చేయ నారంభించెను. రాజు యొక్క సైన్యమును, జమీందారుల సైన్యముల నడగితీసికొని యుద్ధంబున సుశిక్షితులగు కంపెనీ సైన్యముతోఁ జేర్చి, వారిలో బలిష్ఠులైన దేశవిదేశ వీరులను వెదకి సైనికులను తయారుచేసెను. పిమ్మట, నాసైన్యమును గుంపులు గుంపులుగా విడఁదీసి, యాగుంపులకు తగినవారిని యధికారులనుగానియమించెను. పదంపడి, వారికి దేశ దేశములను విభాగించియిచ్చి మీరు వేఁట కాండ్రవలె పొంచియుండి యెచ్చట విద్రోహులు చిక్కినను చీమలను నలుపునట్లు ధ్వంసము చేయవలయు నని చెప్పిపంపెను. కంపెనిసైనికులలోఁ గొందఱు గంజాయి, కొందఱు రం (నిషాగలిగించు సారాయి) త్రాగి, తుపా