పుట:Aananda-Mathamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవప్రకరణము

125


అప్పుడు శాంతి, 'అయ్యా సంతాన బాబు! ఈ ప్రక్కను కొన్నిగదు లున్నవిగదా! వాని నేల చూపలే' దనెను.

గోవర్ధన—— ఆగదులు మంచివియే. అయినను, వానిని జూడరాదు.

శాంతి——ఎవరున్నారు?

గోవర్ధన——గొప్పగొప్ప సేనాపతులు న్నారు.

శాంతి—— గొప్పగొప్ప సేవాపతు లెవరు?

గోవర్ధ—— భవానంద, జీవానంద, ధీరానంద, జ్ఞానానందులు, ప్రకృతము ఆనందముఠము ఆనందమయముగా " నున్నది,

శాంతి——ఆగదులను గూడ చూచెదను.

గోవర్ధనుఁడు శాంతికి 'మొదట ధీరానందుని గదినిఁ జూపెను. ధీరానందుఁడు మహాభారతమునందు ద్రోణపర్వమును జదువుచుండెను. అభిమన్యుఁడు ఏవిధముగా సప్తరథులతో బోరుచుండెనో యాప్రకరణముననే మనస్సు నుంచినవాఁడై యుండెను గాన, నతఁడు మాటలాడ లేదు. శాంతియు మాట లాడక యటనుండి వెడలెను.

అనంతరము భవానందుని గృహంబునకుఁ బోయెను. భవానందుఁ డపు డూర్ధ్వదృష్టి గలవాఁడై ఎవ్వరిముఖమునో చూచుచుండెను. అది ఎవరిముఖమో మనకుఁ దెలియదు, అయినను, ఆముఖము అతిసుందర మైనది; కృష్ణవర్ణమును కుంచితమునైన సుగంధముగల యలక రాశి యాకర్ణ ప్రసారియగు భ్రూయుగ్మముపై వాలి యుండెను. మధ్యంబున త్రి భుజాకారమగు లలాట దేశ మందు మృత్యుకరాళ మగు నల్లనిచాయ కన్పట్టుచుండెను, చూడఁగా మృత్యువును మృత్యుం.