పుట:Aananda-Mathamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

ఆనందమఠము


సత్యానం—— నీయొక్క నవీనవయస్సును బట్టి నీకు నవీనానందుఁ డని పే రిడిన బాగని తోఁచుచున్నది. కావున నీ వానామంబును పరిగ్రహింపుము, అయిన నీ మొదటి పేరేమి? చెప్పుట కేమి యభ్యంతర ముండినను జెప్పవలయును, నాకుఁ జెప్పినయెడల వేఱెవ్వరి చెవిని సోఁకదని నమ్ముము, సంతానుల మర్మమేమనఁగా, ఏదైనను సరియే, ఏవిషయమైనను సరియే, ఆది వాచ్యమైయుండినను సరియే, గురువునకుఁ జెప్ప వలయును. చెప్పినందునఁ నష్టమేమియు నుండదు.

శిష్యుఁడు—— నా మొదటి పేరు శాంతిరామదేవశర్మ.

సత్యానంద——నీ పేరు శాంతిమణి పాపివి కాదా?

అని చెప్పి, సత్యానందుఁడు వ్రేలాడుచుండిన గడ్డమును పట్టి యీడ్వగా నది యూడి వచ్చెను. పిదవ, సత్యానందుఁడు తల్లీ! 'నాయెడ వంచన చేయ నగునా? ఈయల్ప వయస్సుననే వంచన నేర్చినచో నింకేమి? మీసమును గడ్డ ముంచుకొనిన నేమి? నీకంఠ స్వరము, కనుచూపులు, ఈ ముసలివానిముందు మఱుగుపఱుప నగునా! నేను తెలివిమాలిన వాఁడనై యుండినచో నింతటి గొప్ప కార్యమునకుఁ బూనఁగలనా?' యనెను.

శాంతి——ముఖము మాడ్చుకొని రెండు కన్నులును మూసికొని యధోవదనయై యుండెను. వెంటనే కనులు తెఱిచి యావృద్ధునిపై విలోలకటాక్షమును నిగుడించి, 'ప్రభూ! ఏమి దోషము నాచరించితిని. స్త్రీ బాహువులయం దెపుడును బల ముండదా?' యనెను,

సత్యానంద—— గోప్పదంబున నీ రున్న యట్లే,