పుట:Aananda-Mathamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదొకటవ ప్రకరణము

111


సత్యానంద——మన పెద్దలు శాస్త్రముల మూలముగ చాలకాలమునుండి చెప్పిన మాటలనే గదా నేను నీకుఁ జెప్పినాఁడను ఈశ్వరుఁడు త్రిగుణాత్మకుఁ డనుటను నీ వెఱుఁగుదువుగదా?

మహేంద్ర——ఎఱుఁగుదును; సత్త్వ రజస్తమంబులను నీ మూఁడును త్రిగుణములు.

సత్యానంద——మంచిది, ఈ మూఁడు గుణములకును వేర్వేఱు ఉపాసనలు కలవు భగవంతుఁడు తన సత్త్వగుణముచే దయాదాక్షిణ్యాదుల నుత్పత్తి చేయుచున్నాఁడు. కనుక ఆయు పాసనము భక్తితోఁ జేయవలయును; చైతన్యసంప్రదాయస్థు లట్లు చేసెదరు. రజోగుణము చేత నాతని శక్తి ఉత్పత్తి యగుచున్నది. దీని యుపాసన యుద్ధము చేతను, దేశ ద్వేషుల నిధనంబునను గావలయును; మేము దాని నాచరించెదము. తమోగుణము చేత భగవంతుఁడు శరీరి యగుచున్నాఁడు. చతుర్భుజాది రూపంబుల నిచ్ఛామాత్రంబున ధరించును. ప్రక్బందనాద్యుపచారములచే నీగుణము యొక్క పూజ కావలయును; సాధారణజనులు దీని నాచరింతురు. ఇపుడు తెలిసి నదా?

మహేంద్ర—— తెలిసెను. సంతానులు ఉపాసక సంప్రదాయకులుగ మాత్ర మున్నారా?

సత్యానంద——ఔను, మనకు రాజ్యము వలదు. మ్లేచ్ఛులు భగవంతుని విద్వేషులై యుండుటఁబట్టి వారిని సమూలముగా హతము చేయవలయు ననునది యొకటే సంకల్పము.