పుట:Aananda-Mathamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము

శాంతి గురుదర్శనంబు చేయుట

మరునాఁడు ఆనందమఠంబున నేకాంతమగు గదియందుఁ గూర్చుండి భగ్నోత్సాహులైన సంతాన నాయకులు మువ్వు రాలోచించు చుండిరి. జీవానందుఁడు సత్యానందునిఁ గాంచి 'మహాస్వామీ ! దైవము మనయం దేల యిట్లు అప్రసన్నుఁ డాయెను ? ఏదోషఁబువలన మనము మ్లేచ్ఛులచేఁ బరాభ వింపఁబడితిమి? అని యడిగెను.

సత్యానంద—— దైవము ప్రసన్నము కాకపోలేదు. యుద్ధంబున జయాపజయంబులు రెండును గలవు, ఆదినము మన ము జయించితిమి. ఈదినము పరాజితులమైతిమి. తుదకు జయమే సిద్ధించును, ఎవఁ డిదివఱకును దయ చూపినాడో యాశఁఖచక్ర గదాధారి యగు వనమాలియే రక్షించుననినాకు నిశ్చయముగా నమ్మకము గలదు. ఆతని పాదములను స్పృశించి మనమే వ్రతమును గ్రహించితిమో యావ్రతమునే సాధింప వలయును. విముఖల 'మైతి మేని యనంతనరక భోగంబుల నను భవింతుము. మన భవిష్యన్మంగళవిచారంబునందు నాకేమియు సంశయము లేదు. అయినను, దైవానుగ్రహము లేక యేకార్యమును సిద్ధింపదు. దానికి పురుషకారమును గావలయును. మనము నిరస్త్రులమై యంటిమి. గుండు తుపాకి ఫిరఁగీల యెదుట మన కొయ్యలు, బళ్లెము లేమి చేయ నోపును. కనుక, మనకు పురుష