పుట:Aananda-Mathamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ఆనందమఠము


నెఱవేర్చెద. ఒక్కసారి కేమి ప్రాయశ్చిత్తమో నూరుసారుల కదియే ప్రాయశ్చిత్తము.' అని యెంచుకొనెను.

ఈ ప్రకారముగా నాలోచించుకొని శాంతి యన్నంబును ప్రొయ్యిలో పడవేసి వనంబున కేఁగి కొన్ని ఫలములను దెచ్చికొని తినెను. అనంతము, నిమాయి కోరియుండిన కొత్త సరిగె చీరను దీసి యంచులను చించి పాఱవైచి, యాచీరెను కావి నీటిలోఁ దడిపెను. చీరకు కావిరంగు పట్టెను. దాని నెండించుటకు ఎండ లేదు. సాయంకాల సమయము; దాని నల్లే యారవేసి కొంచెము చీఁకటి కాఁగానే తలుపును జక్కఁగా వేసికొని యొక చమత్కారమైన కార్యమునందు శాంతి ప్రవర్తింపఁ దొడంగెను. దువ్వక పేనుకొని ఆగుల్ఫలఁ బిత మైయున్న తన శిరః 'కేశ రాశిని పిడికిటఁ బట్టుకొని కొంతఁ గత్తరించి యుంచుకొని, తక్కిన తల వెండ్రుకలను జడవలె చేసెను, దువ్వెనముఖము జూడక చెదరి యుండిన వెండ్రుక లాయ పూర్వవిన్యాసము చే భారమైన జడగా పరిణమించెను. పిదప, తడియారఁ గట్టిన కాషాయవస్త్రమును రెండుగాఁ జించి యొకటి నిదన మనోహర మగుసంగంబునకుఁ గట్టి కొని, మఱి యొకటిని ఱోమ్మునకు బిగించి కట్టుకొనెను. ఇంటియందొక చిన్న యద్ద ముండెను, చాలకాలమునకు దానిని దీసి తన వేషంబును జూచి కొని, 'అయ్యో! యెంతపని చేసితిని' అని యనుకోని, దర్పణమును బాఱవైచి, కత్తిరింపఁబడియున్న వెండ్రుకలతో శ్మశ్రువును గల్పించెను. ఆచంద్ర బింబమువంటి ముఖము క్రోత్తలగు గడ్డము మీసములతోఁ బ్రకాశించెను. అనంతరము ఇంటిలోనున్న యొక హరిణచర్మంబును కంఠమునకుఁ గట్టికొని యెను. అది కంఠము నుండి జాను పర్యంతము శరీరము నాచ్ఛా