పుట:A Collection of Telugu Proverbs.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.


1492. పులిని జూచి నక్క వాత పెట్టుకొన్నట్టు.

The jackal branded himself with spots like a tiger.
Vulgar display.
Apeing one’s superiors.

1493. పులి పక్కను జోరీగ వున్నట్టు.

Like a gadfiy on a tiger’s side.
A safe refuge.

1494. పులిపిల్ల పులిపిల్లే, మేకపిల్ల మేకపిల్లే.

A tiger-cub is a tiger-cub, a kid is a kid.
(See Nos. 269, 371, 515, 571, 573, 832, 924, 1475.)
Cat after kind.

1495. పులి మీసములు పట్టుకొని వుయ్యాల వూగినట్టు.

Taking hold of a tiger’s mustaches and swinging one’s self.
A rash enterprise.

1496. పువ్వు పుయ్యగానే తెలుసును పరిమళము.

As soon as a flower is full blown, it’s fragrance is perceived.
A man’s worth is known when he is grown up.

1497. పూజ కొద్దీ పురుషుడు, పుణ్యము కొద్దీ పుత్రుడు.

A husband according to the worship [of the wife], a son according to the good works [of the father].

1498. పూటకూళ్లకు వచ్చిన వారికి పుట్ల ధర యెందుకు.

What have people buying cooked food, to do with the price of Puttis [of grain] ?
(For Putti see No. 1480.)

( 262 )