పుట:ASHOKUDU.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

అశోకుడు

జైనను గురుండగు తీర్థస్కర మహావీర స్వామి జన్మభూమి యగు నావాగ్రామ మా వైశాలినీ నగరమునకు సమీపము నందే యుండెను. సుప్రసిద్ధమగు మహా వనవిహారము దాని సమీపముననే యుండెను. ఆ విహరమునందు బుద్ధ దేవుఁ డనేక పర్యాయములు, తన శిష్యులకు శాంతి మత ధర్మోపదేశములను బ్రసాదించియున్నాఁడు. అశోకమహారాజును, మహాత్ముఁడగు నుపగు ప్తుఁడును, దామా నగరమునందు బ్రవేశించి పరమానందము నొందిరి. అచ్చటి ప్రత్యేక దృశ్యములు వారిపుణ్యస్మృతులను బ్రగాఢములుగఁ జేసి వై చెను. అచ్చటి ప్రజలు మహా రాజగు నజాతశత్రుని దిరస్కరించి స్వరాజ్య ప్రతి ష్టాపనముఁ జేసికొని యుండిరి. ఆ స్థానమునందసంఖ్య దండనాయకు లేకీ భవించి యనుకూల నిబంధనములతో రాజ కార్యనిర్వహణము చేయుచుండిరి. వైశాలినీనగరమున బౌద్ధ ప్రభావ మప్పుడును నిరాఘాటముగ నెలకొని యుండెను. అచ్చటి వాలు కారామవిహారస్థానమునం దప్పుడు చాలమంది భిక్షులును, శ్రమణులును వాసము చేయుచుండిరి.

ఆశోకమహారాజా స్థలమున గొన్ని స్థూపములను నిర్మించెను. ఆ స్థూపముల జీర్ణాశ్రము లిప్పటికీని యాత్రికులకుఁ బూర్వస్మృతిని గలిగించుచున్నవి. వై శాలినీనగరము నుండి యశోకుఁడు సపరివారముగ రామగ్రామమునకుఁ బ్రయాణమయ్యెను. రామగ్రామ మనోఘా నదీతీరమందున్నది. అచ్చటి యామ్ర కాననమందే మహాత్ముఁ డగు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/98&oldid=334955" నుండి వెలికితీశారు