పుట:ADIDAMU-SURAKAVI.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఆడిదము సూరకవి.



సూరకవి తనగ్రంథముల నన్నిటిని రామచంద్రపుర రామలింగేశ్వరున కంకిత మొనర్చెను. గంథములు' -దేవాంకిత ములైన కారణముచేతఁ గవి కాలనిర్ణయమునకు సౌకర్యము నియ్యఁజాల కున్నవి. అయినను నితఁడు తనప్రభువులగు విజయనగర పురాధీశులపై ఁ జెప్పిన చాటుపద్యముల వలనఁగాల నిర్ణయము చేయుటకు వీలగ పడుచున్నది. పూర్వోదాహృత ములైన మెత్తనైనట్టి యరఁటాకు మూఁదఁగాక " అను గీత పద్యమును ఢిల్లీలోపల గోలుకొండ పురినిండా "అను వృత్త మును, క్రీస్తుశకము 1746 సంవత్సరపాంతమున * బాదుల్లా ఖానునకును మొదటి, “పెదవిజయరామ మహ రాజునకు ను జరిగి న యుద్ధమును గూర్చి సూరకవి చెప్పియున్నాఁడు. దీనిని బట్టి సూరకవి 1738 మొదలు 1757 వఱకు రాజ్య ముచేసిన 'పెదవిజయ రామ మహా రాజుగారి కాలమున నున్నాఁడనుట స్పష్టము.

పెదవిజయ రామరాజుగారి తర్వాత ఆనందగజపతి మహా రాజుగారు. రాజ్యమునకు వచ్చి కొలఁది కాలము మాత్రము


- * "స్న 1158 ఫసలీ 1748 సంవత్సరములో జాఫరల్లీ ఖాసుడికి అయివజుగా బహుదుల్లాఖానుడు శ్రీకాకుళం సర్కారుకు ప్రవేశించినాఁడు. అదివరకు జాఫరల్లీ ఖానుడు 8 సంవత్సరములు హకీంగిరిచేసినాడు. . అటు తరు వాత బహుదుల్లాఖానుడికిన్నీ విజయ రామ రాజు గారికిన్నీ హవేలీ పరగణాల నిమిత్తమున్నూ జమాబందీఖణా యించడం నిమిత్తమున్నూ జవాబు సవాలు నిమిత్తమున్నూ లడాయివచ్చి కలహం చేస్తూ యున్నంతలో' "(......శ్రీవిజ యనగరం సంస్థావం డెయిరీ మెమోరాండము. 1652-1845.) . :