పుట:ADIDAMU-SURAKAVI.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము.

29


మరల తమ్ముని మంచిమాటలాడి 1790 సం|రమునం దొకసారి యు 1792 సం||రమునం దొకసారియు మరల సంస్థానములో దివానుగాఁ బ్రవేశించి కడపటిసారి కంపెనీ వారి చే చెన్నపురికిఁబోవు నట్లుత్తరువు చేయఁబడి నెలకయిదు వేల రూపాయిల యుపకార వేతనము మీఁద 1798 సం||రము నందక్కడకుపోయి చేరెను. సీతారామరాజు గారి దుష్పరిపాలనము మొదలయిన కారణములచేత విజయరామరాజుగారు ఋణముల పాలగుటయే గాక కంపెనీ వారికి కట్టవలసిన కప్పమును సరిగా కట్టలేక యాఱుులక్షల యిరువదియైదు వేల రూపాయిల వఱకును బాకిపడిరి. అందుచేత కంపెనీవారు సంస్థానమును తమపాలనమునకుఁ దీసికొని విజయ రామరాజు గారెం రాజ్య మునుపెడిచి మచిలీ బందరులో వాసము.చేయునట్లు యుత్తఱరువు చేసి ఆయనకు ముప్పది వేలకూపాయ లొక్కసారిగా రొక్క మిచ్చెదమనియు నెలకు 1200 రూపాయిలు వ్యయ ములకిచ్చెద మనియుఁ జెప్పిరి. ఆయన స్వదేశమును విడుచుట కిష్టము లేని వారయ బందరు పురమునకుఁ బోవు మార్గమున బయలుదేఱి యైదాఱుకోసుల దూరము పోయి యక్కడనుండి పరివారముతో వెనుకఁదిరిగి పద్మనాభమునకుఁ బోయి యక్కడ నుండి తాను ప్రయాణము చేయలేక పోవుటకు సాకులు వ్రాయనారంభించెను. విజయరామరాజుగా రక్కడ నున్న కాలము లో రాచవారును నాలుగువేల సైనికులనుబోయి యాయనను