పుట:2015.393685.Umar-Kayyam.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

45

175

ఎల్లలోకంబు తగ సంస్కరించు ఫలము
సాధుహృదయార్తిఁదీర్చిన సాటి గాదు
వేయి బానిసలును విడిపించు ఫలము
ఒకని దయ నోముఫలమున కోప దనఘ.

176

ఈశ్వరునిఁజెప్పుగురుని నార్జింపు, మెపుడు
మృత్స్వరూప "కాబా" ల నూఱింటి కంటె
సాధుహృదయంబె పూజ్యంబు సాధుసేవ
సేయు మెపుడు "కాబా" యాత్ర సేయ నేల.

177

మనసులో గర్వవాంఛలు మానుకొనుము
దర్వి ఫలసిద్ధి తనజన్మఁ గాంచలేఁడు ;
అంగనలముంగురులభంగి వంగనేర్చు
మసువుతంతువులు తెగి మ న్నవకమున్నె.

178

పరుల వంచించి సంతోష పడెదవేని,
పుడమి బ్రతికినన్నాళ్ళు నీ బుద్ధికొఱకు
వగచుచుండెద ; విట్టి నీ బాధ చూచి
కుమతి వీవని జను లనుకొందు రెపుడు.