పుట:2015.393685.Umar-Kayyam.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

35

135

ధనవాంఛన్ ద్యజియించి పోవఁ బ్రతిపాదంబందు వేవేలుగా
ధనరాసుల్ లభియించు ; లేనియెడ నర్థం బర్థిరాఁబోవ ; దే
పనియైనన్ సమకూడలే దని మదిన్ భావింప ; కీదుఃఖ ముం
డిన దీర్ఘంబు ననర్థదాయకము నై డిందించు నీజీవమున్.

136

తినుటకు సరిపడు ద్రవ్యం
బును దగు నార్జింపు మధికము గడింపఁగఁ గో
రిన వ్యర్థముసుమ ! జీవిత
మును వృథ గావింప కట్టి మూర్ఖత్వమునన్.

137

చీకులు, రొట్టిముక్కలును శీధువు నొక్క రహస్యమందిరం
బో కమలాక్షి యున్న నిఁక నుజ్జ్వలరాజ్యపదంబు నొల్ల ; నా
నా కలుషావహంబయి, యనంత దురంతవిచారఘోర దు
ర్వ్యకులమై తనర్చెడు ప్రపంచము నీగతినే తరించెదన్.

138

రెండుదినాలకైన నొకరే యొకరొట్టె లభించెనేనిఁ నొ
రెండినవేళ నింత జలమిచ్చెడు పెంకు లభించెనేని నే
నొండొరువేడి వాని కొలువుండను ; నాగతి మానవుండె భూ
పుండును ; వానిగొల్చుచును బొట్టను నింపుకొనంగఁ బోదునే ?