పుట:2015.393685.Umar-Kayyam.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

33

127

పూలసువాసనార్థమయి ముండ్లశ్రమన్ బడుటబ్రమే యుషః
కాల సుధారసార్థమయి కైపు భరింపఁగఁబోలదే ? యటుల్
బాలకురంగనేత్ర, శశిఫాల మనోహరికై తపింపగాఁ
బోలును నిక్క మారమణిఁ బొందిన సౌఖ్యము లెన్న శక్యమే.

128

సుజనునకుఁ బ్రాణ మిడవచ్చుఁ జొక్కి వాని
చరణములకును జోహారు సలుపవచ్చుఁ
గాని కుజనునితో మైత్రిఁ గలుపరాదు
నరకకూపం బదే యెన్నినాళ్ళకైన.

129

కోవిదులు పవిత్రాత్ములఁ గూడి మనుము ;
దుర్జనులఁ జూచి క్రోశముల్ తొలఁగిపొమ్ము ;
కోవిదుం డిచ్చు విషమైన గ్రోలు ; మల్ల
దుర్జనుం డిచ్చు పాలైనఁ ద్రోసిపుచ్చు.

130

పుణ్యపాపాల సంబంధమును ద్యజించి
వాంఛలను వీడు ; మృతి సులభంబె యగును ;
బ్రతికినన్నాళ్ళు సంతోషపడుము ; మిగిలి
యున్న కాలంబు గడచు నేదోవిధాన.