పుట:2015.393685.Umar-Kayyam.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఉమర్ ఖయ్యామ్

43

ఓ వెలదీ! త్వ దాస్యశశి యుజ్జ్వలకాంతి జగజ్జనాళి ప్రా
ణావసధంబు; నాకుఁ బ్రణయాత్మక మందఱి జీవగఱ్ఱ యో
దేవి! త్వదాననద్యుమణిదీప్తి ప్రపంచ తమో నివారకం
బై విలసిల్లు; [1]నీగతి మహాజనులెల్ల నుతింతు రర్థులై.

44

పాఠాంతరము :_
నినుఁగని కరఁగని హృదయము
నినుఁగని మోహించనట్టి నేత్రంబులు లే,
వనఘా! నీకివి లే వెం
దును గాని త్వదాశలేని దుండదు ప్రియమున్.

45

నీ యెడఁబాటుచేఁ గరఁగి నీరవనట్టి మనస్సు లేదు; లే
దేయెడ నిన్నుఁజూచి భ్రమియింపని నేత్రపుటంబు లీ రసా
ధ్యాయమె నీకు లేదు; ప్రియమన్నది లేశము లేదుఁ గాని నీ
ప్రాయము ప్రేమపాఠములఁ బాడనివారలు లేరు నెచ్చలీ.

46

తరుణీ! నీ విరహాగ్ని నెప్పు డెద దగ్ధంబందఁగా మచ్చ లె
ట్టి రసా వేశత మాన్పివైచె నపుడే డిందెన్ బ్రపంచేచ్ఛ; లీ
తెఱఁగున్ దృప్తిఘటించె నీ వలపుదీప్తిన్ లోకకళ్యాణమై
పరఁగెన్ ద ద్రవిరేణు హస్తముల దీపం బిచ్చిన ట్లయ్యెడున్.

  1. నేనొకఁడ నాడుటగా దిటు లోక మాడెడిన్.