పుట:2015.393685.Umar-Kayyam.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ఉమర్ ఖయ్యామ్

4

శరధినిబోలు విద్యయును జ్వాలనుబోలిన జ్ఞానదీప్తియున్
బరఁగినవార లీ నిశిత భాసుర గాఢ మహాంధకార బం
ధురతర మార్గమున్ గడచు త్రోవనెఱుంగక కల్పనా కథా
భరిత వివాదవీచికల పాలయి ప్రాణము వాసి రార్తులై


5

చదివితి రేఁబవళ్లెదఁ బ్రశాంత నితాంతక సంఘటింపఁ ద
త్పదములలోనఁ గొన్నిటి యథార్థముతోఁపక పెద్ద సంశయా
స్పదముగ నుండిపోయినవి భావమునం దవి పోల్చి చూడఁగా
మొద లొకటైన నేరవని బోధపడెన్, మఱి చెప్పవచ్చినన్.

6

చుక్కలఱేఁడు చుక్కలును జూడ్కికి సొంపులునింపు నింగిపైఁ
జక్కని వేవెలుంగు విరసంబగు నీ ప్రకృతిస్వభావమం
దొక్కటియున్ యథార్థ మననోపదు నూహనుబుచ్చి చూచినన్
జిక్కదు భ్రాంతిజన్యములచేఁ జెడరాదు జడత్వ మేర్పడన్.

7

సొగసు సువాసనాకలితా శోభితవైఖరి సౌకుమార్య మిం
పగు వదనాంబుజాత విభవాప్తి సలాకనుబోలు తీరుననున్
మిగిలినవన్ని వన్నియల మీఱెడు నట్టులనున్న నన్ను మృ
త్యు గరిత యేలదార్చి పెనుధూళి గృహాన నలంకరించెనో.