పుట:2015.393685.Umar-Kayyam.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

అదియు ప్రేమైక రసరూప మవ్యయంబు
వెలువడెను గాదెనందుండి వెలుగదేదొ
నిండెనా వెల్గు జగముల నిండె నిజము
నిండె నావెల్గు నాలోన నిండె నిజము
నిండి నాలోన జతనావ మండిపోవ
నిలిచె సంతృప్తిం నాలోన నిలిచిపోవ
ఇమిడె ప్రమదంబు నాలోన నిమిడిపోవ
తెలిసె జగములు "నేన"ని తెలిసిపోయె
నేనె "విశ్వంబు" విశ్వంబు నేనె నిజము
నిజము యీ దృశ్యమంతయు "నేనె" నిజము
గగనములలోన నారూపె గానుపించె
భాస్కరునియందు నారూపె బరగుచుండె
నలిలమందును నారూపె సాగుచుండె
ఈ వసుందర నారూపె యసగుచుండె
అరయ వాయువులో నిండినదిగొ దోచె
అదిగో వైశ్వానరుని నిండెనదిగొ చూడు
ఎన్ని చెప్పదు సర్వంబు "నేను" గాను
సృష్టినంతయు నాలోనె చూచినాడ
ఇదే పరంజ్యోతియన నొప్పు నీ వెలుంగు
ఇదియె యోగులుగన్నట్టి జ్యోతి సుమ్ము
నిలచిపోదు నీ జ్యోతి నేనెప్పటికిని
నిలచేపోయి నీ జ్యోతి నేనెప్పటికిని
కాను మిముజూడ వాంఛనే రాను రాను
తిరిగివచ్చెడి నాశలు తీరిపోయె
నెడలి వచ్చిన మాటలు వేరు లేవు
లీనమగుదు నీ జ్యోతిని నేనుగానె !
మరచిపొండింక నారాక మఱచిపొండు
వదలివేయుడు దర్భలు వదలునట్లు
విడిచివేయుడు ధారను విడచునట్లు
ఇట్లు "హుస్సేనుషా కవి ఎరుక జెప్పె !