ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉమర్ ఖయ్యామ్
177
695
ఏము విధూతపాప మలినేచ్ఛ లహంబును బాసి వాసిమై
సోమరసంబుఁ ద్రావి దివిఁ జొచ్చి యధోర్విని లేచి పోయినా :
మీమలినంబు పోయిన దిసీ ! తొలిమట్టిని బుట్టినాము మే
మై మఱి మట్టిలోఁ గలిసిపోయితి మింక విచార మేటికిన్.
696
ఒకచేతన్ "పురఖాను" తక్కుకరమందో శీధుపాత్ర ప్రదీ
ప్తకళాప్తిన్ విధియున్, నిషేదమును సంప్రాప్తింపఁగాఁ బట్టియే
నొకటన్ గాలహతిన్ బ్రభిన్నతను నుద్యోగించి నిక్కంపు నా
స్తికుండన్ గాక యథార్థపద్ధతిని ముస్లింగాకయున్నా నిటన్.
697
ఆదిఁ బవిత్రవస్తుసఖమై జనియించి ధరిత్రి భౌతికో
పాధివిధూతపూతమతిఁబాడయిపోయితి మిందువచ్చి యా
మోదము మాఱుగా వ్యసనముల్‌లభియించె నలభ్యవాంఛ లా
పాదశిరంబుఁ గాల్చె నిటు వ్యర్థముగా నశియించె జన్మమున్.
698
ఎంతెంత యహము వదలునొ
యంతంత ప్రవర్థమానమబ్బును ; నా కెం
తెంతగ వినయం బేర్పడు
నంతంతగమైక మబ్బు నానందసుధన్.