పుట:2015.393685.Umar-Kayyam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తలుపులు విప్పవచ్చినను తథ్యము నీవయి వచ్చి విప్పఁగా
వలయును, దారిచూపునెడ బాంధవుఁడై చని నీవె చూపఁగా
వలయును ; గాన నేనెవరి పంచలఁ జేరను ; వారలెల్ల రీ
యిల నశియించి పోయెదరు నీవె స్థిరంబు సతంబు నీశ్వరా. 317

స్థావరజంగమస్థ వసుధాతలమున్, నభమన్, ద్రికాలమున్
నీవ ; త్వదన్యమొక్క యణువేనియులేదు ; మహాత్మ ! నేను పా
పావిలవృత్తినైనను ద్వదర్థము దాస్యము సేయుచుందు ; నా
దేవుడవీవు రక్షక ! త్వదీయుఁడ దోషములేని నాకికన్. 674

ఇతడు నైతికజీవితముయొక్క యాధిక్యమునుగూర్చి కూడ విశేషముగాఁజెప్పినాఁడు. ఉదా||

"పాపములాచరింపుఁడని పల్కెడు పామరులందు జ్ఞాన మే
  రూపుననైన లేదని నిరూఢినెఱుంగుఁడు ; పాపమందు నె
  వో పరలోకసిద్ధు లణిగున్నవటంచు వచించుదుర్మతుల్
  కాపురుషుల్, మహావ్యసనగాఢతమస్సునఁ జిక్కకుందురే."

ఈతని గ్రంథము జనులను వామమార్గులుగాఁ జేయునని కొంద ఱభిప్రాయపడుతున్నారు. ఈ గ్రంథము జనసామాన్యమునకై వ్రాయ లేదని ఉమర్ ఖయ్యామ్ నుడివి యున్నాఁడు. ఈ గ్రంథమునుబ్రజలు సరిగా నర్థము చేసికొనఁజాలరని ఔరంగజేబు చక్రవర్తి తన సామ్రాజ్యమున నెవరును జదువకూడదని శాసించెను. కాని యీ గ్రంథము నతఁ డెల్లప్పుడుచదువుచుండెడివాఁడు. ఈగ్రంథమునిష్ఠాగరిష్ఠులైనతత్త్వవేత్తలకై వ్రాయఁబడినది. ఇందలి మధువు దయారసమనియు, మానిని ఈశ్వరుఁడనియు నర్థముచెప్పిరి. అట్లుగాక మధువు మానినులసహజార్థమును