పుట:2015.393685.Umar-Kayyam.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

ఉమర్ ఖయ్యామ్

614

చెఱ విడిపించి, నీ తెరువు చెప్పి, త్వదీయపరత్వమైన సు
స్థిరతను గూర్చి బంధములు త్రెంచి స్వతంత్రత నిచ్చి పోవుమో
హరి ! నను బాపపుణ్యముల నంటని మైకములోన ముంచు మీ
యెఱుకసు వచ్చుకర్మముల కే నిఁక బాధ్యుఁడఁ గానికైవడిన్.

615

క్షమ యను నశ్వ మెక్కిన దిగంబరిఁ జూచితి ; వానికిన్ నిషే
ధములును, శౌచశీలములు, ధర్మ, మధర్మము, నస్తి, నాస్తిక
క్రమములు లేవు ; లే విహపరంబు లహో 1 యిటువంటి ధీర సం
యమి గలఁడే జగత్త్రయమునందు యథార్థము చెప్పవచ్చినన్.

616

మేమందఱము సదా ప్రేమ నర్చింతుము
             మధ్వాసవము మాకు మార్గదర్శి
విధినిషేధము లను వెఱ్ఱులు లేవు క
             ల్లంగడియే మాకు నాలయంబు
ఇంపు సొంపులలెక్క యిసుమంతయును లేదు
             తెలివితేటలు మాఁకు గలలకలిమి
మేము విజ్ఞుల మని యేమఱి తలఁపకుఁ
             డతిప్రమత్తత మాకు నాత్మవిద్య.


617

ఓ మతీ ! నీవు ప్రియురాలి యోలగమున
కరిగినప్పుడె స్వాతంత్ర్య మరిగిపోయె ;
నామెతోఁగూడికొనిన దగ్ధాసవమున
విధినిషేదంబు లన్నియు వెడలిపోయె ;