పుట:2015.393685.Umar-Kayyam.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

153

602

చూపులకున్ గురూపమును సోయగమొక్కటె ప్రేమయున్న ; ను
ద్దీపితనాకమున్, నరకదీధితి యొక్కటె పిచ్చిప్రేమకున్
రూపఱియున్నవారి కపురూపపుశాలువు ఖద్ద రొక్కటే
యీ పదినాళ్ళ కే యుపల మే యుపధానము నైన నొక్కటే.

603

ఝరులతటంబులన్, వనుల, సామజయానల శాద్వలైక సుం
దర మధుమాసవాసర వితానములన్, గనెదేని యా దెసన్
బరుగునఁ బొమ్ముషస్సులను బట్టినమద్యముద్రావి ; గుళ్ళు గో
పురముల కే మసీదులకుఁ బోయిన వ్యర్ధము నిన్నుఁబిల్తురే ?

604

"కాబా" యైనను, మద్యశాల యయినన్ గాదే తపోమందిరం ?
బా బింబాధర వేణుగానము తపోధ్యానైక గీతంబు గా
దే ? బుద్ధాలయమైనఁ యూధుగుడియౌ నేనిన్ దపోవాటి కా
దే ? బంగారపు క్రాసెయైన, జపమా లేనిన్ దపశ్చిహ్నమే !

605

ప్రేమ మహామనీషులకు వీతరుజా మధుశృంగపాత్ర ; మీ
ప్రేమ నవీనయౌవనము పేరిటి గీతములోని భావ ; మీ
ప్రేమ మనీషిలీల లరరే ! రవమేనియు నీవెఱుంగ వీ
ప్రేమయె జీవితం ; బిదియె వెంటనెయుండు సతంబు నీడ యై.