పుట:2015.393685.Umar-Kayyam.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

149

586

జగతిపను లెల్లఁ గడచె నిష్టములఁ బడసి
యాయు వరిగెను, మృతి వచ్చె ననుచు సంత
సింపు ; మీ వట్లు చేయవు ; చేయఁగలిగి
తేనిఁ జేసితి నని నిశ్చయించుకొనుము.

587

అనుకొనుము కృతార్థత నభ మంటినాఁడ
ననుకొనుము భోగభాగ్యాల నందినాఁడ
ననుకొనుము కోటిఁ గంటి నిష్టార్థనిధుల
ననుకొనుము వీని విడనాడి చనవలెనని.

588

అవని యీ మూలనుండి యా మూలదాఁక
మణులు, రత్నాలు నారఁబోసినవిధాన
నున్న, "సహరా" యెడారి మంచున్నరీతి
వానిపైఁ గూరుచున్నఁ బోవలయుఁ దుదకు.

589

జగతి సమస్తవస్తువులు స్వాంతమ ! చక్కఁగఁ గూర్చుకొంటి ; వే
యగుడును లేని సమ్మదమహావని బచ్చనిపైరుపైఁ గడున్
సొగసులఁ గుల్కు మంచువలె సొంపుగ నీ వొక రాత్రి వానిపైఁ
దగ శయనించి వేకువముదంబున లేచియె పోదు వెంతయున్.