పుట:2015.393685.Umar-Kayyam.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

113

442

మధువు నెప్పులు భక్తుఁడు మానఁబోడు
అతని కది యమృతాభమై యలరుఁజూవె
పర్వదినముల నీశ్వర ప్రార్థనంబు
మానెనేనియు నిర్వాణమూను నతఁడు.

443

పండుగ నేఁడు వచ్చెఁ ; బనిపాటల వేడ్కలభించు ; మద్యమున్
గుండలనిండఁ బోసి యిడి కోర్కెలఁ దీర్చు "నుమర్‌ఖయా" మదే
చండతపస్సమాధి ఖరసన్నిభులై వ్రత మాచరించు పా
షండుల నోటికళ్లెములఁ జక్కడఁగించు విలాస మేర్పడన్.

444

ఈ యుపవాసవాసరము లెంతయుఁ దీవ్రతతోడ వచ్చె న
య్యో ! యెటుతోఁచకున్న ; దలయూహలుశృంఖలలందుఁజిక్కె ; దే
వా ! యిఁక లోకజాలమునకంతకుఁ భ్రాంతిని బెట్టి పర్వపున్
హాయన మట్లు మార్చుమతి నబ్బురపా టొదవంగ నెంతయున్.

445

ఉపవాసపునెల వచ్చిన
యపుడు నిషేధంబు మధ్య ; మా ముందే త్రా
వి పరుండెదఁ బండుగవఱ
కపరానందంబు మదికి నబ్బెడురీతిన్.