పుట:2015.393685.Umar-Kayyam.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఉమర్ ఖయ్యామ్

422

మానితి ; దానినే తిరిగి మన్ననఁజేసితిఁ బెక్కుసారు ; లిం
పైన యశంబు దుర్యశమటంచుఁ గవాటము మూసికొంటి ; నే
దే నొకతప్ఫు చేసితినయే న్విడనాడకు ప్రేమ ? యా సురా
పాన ప్రమత్తచిత్త మలవాటయిపోయెను మాకు చెన్చెలీ !

423

ఆసవమున్, దదీయకలశావళి నీనిసిముట్టనంచు నే
బాస యొనర్చుచుంటిఁ బ్రతివారము ; కాని వసంతకాలపున్
మాసము లేగుదెంచినవి ; మమ్ము యథేచ్ఛను వీడుఁడింక నీ
మాసములందు మద్యమునుమానుదురే యెవరైన నెచ్చెలీ !

424

సొంపగుపానపాత్రయును సోమరసంబును దెచ్చి హస్తమం
దింపుగఁ బెట్టవేమి హరిణేక్షణ ? యీ సురశృంఖలాకృతిన్
గంపితమై మృదుక్వణనికాయముతో నలరారు ? దీని నో
యింతిరొ ? నాకరాన నిడుమీ మతిసంచలనంబు దీఱఁగన్.

425

ఓ ప్రియ ! యీ ప్రభాత విభవోజ్జ్వలమౌ సమయంబునందు మ
ద్యప్రియుఁడైన నాకు మధురాసవమిమ్ము ; కృతఘ్నపాళి లో
కప్రచయంబు ; నిందు గుణకర్మవిహీనుఁడ నంచు నన్ను వి
శ్వప్రజలందుఁ జాటుచును వారుణిఁబోయుము ప్రేమ యేర్పడన్.