పుట:2015.393685.Umar-Kayyam.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

91

355

చెప్పుటకు వినుటకు నాకుఁజెలులె లేరు ;
అశ్రువులె నాకు మిత్రు ; లీ యశ్రుమిశ్రి
తాక్షు లేడ్పునకైయున్న వహరహంబు
నేడ్పునకె స్వాగతంబు గావించువాఁడ.

356

నీవు రహస్య మెఱింగిన
నీవిధి వ్యసనంబు నొంద వేకార్యంబుల్
నీవలనఁ గావు ; కావున
జీవించిననాళ్ళు సుఖముఁ జెందఁగ వలదే.

357

ఎల్లర హితంబు గొనుము దీవించునట్లు,
బాధలను, వ్యసనంబును బడయవలదు
కలిమలేముల ధైర్యంబు గడవవలదు
తుదిఁ గృతార్థుఁడ విట్టు లయ్యెదవు నీవు.

358

మధువు

సురయే బలమును, జవమును
సురయె రహస్యముల నెల్ల శోధించును నీ
సురనిడ నిహపరము లొదవు
సుర గ్రుక్కెడుకంటె స్వర్గసుఖ మెటఁ గలదే.