పుట:2015.393685.Umar-Kayyam.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

ఉమర్ ఖయ్యామ్

344

హతవిధి చెయ్దిముల్‌గనుమి యక్కట యెక్కడఁ జూడఁబోయినన్
హితులనువారెలేరు ; మఱియేడ్చిన లాభములేదు ; ధాత్రిపై
బ్రతికినయన్నినాళ్ళె మది రంజిలఁజేయుము నిన్నఱేపు నా
వెతలకుఁ బాలుగాకు ; కలవేళ సుఖంబుగవెళ్ళఁబుచ్చుమా.

345

నలువంకలెందాకనిలిచి కన్నులు చూడఁ
           జాలునో యందాఁక సహజలీల
శాద్వలంబులును సస్యశ్యామసీమలు
           స్వర్గంబుతో నెనవచ్చుచుండె,
సెలయేళ్ళు నిర్మలజలపూరితంబులై
            యాకాశగంగనా నలరుచుండె,
నీ యరణ్యంబెల్ల వీక్షింక్షితే స్వర్గ
            పట్నమే యని వేఱేపలుకవలెనె
ఇచట నరకంబు లనుపేరులెత్తవలదు
నీ మనోహరి యొయ్యారినీరజాక్షిఁ
జంద్రవదననుగూడి హర్షమునఁబొంగి
స్వర్గమిదెయని కూర్చుండవలదె చెపుమ !

346

ఓయి ! జగద్రహస్యమును నూహ నెఱుంగవు ; దీని విజ్ఞులన్
నీయెడ విప్పిచెప్పరు ; వినిందత వాదమువల్లఁ దేల దీ
న్యాయము ? మద్యమున్ జషకమందిడి స్వర్గముగట్టుకోమ్మ ముల
దే ; యల నాకలోకమున కేఁగెదొ, మానెదొ చెప్పనేర్తువే ?