పుట:2015.393685.Umar-Kayyam.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

79

310

ఏనొక వృద్ధుఁగంటి నతఁ డెంతయు మద్యము ద్రావి త్రావియ
జ్ఞానపుఁ బాచి దేవగృహగర్భమునన్ దగ నూడ్చి విహ్వలుం
డై నిదురించి యీశ్వరుఁ డనంతుఁడు హింసయొనర్పఁ డెప్పు డె
వ్వాని నటంచు నాడుచును బాడుచునుండె విలాస మేర్పడన్.

311

నీ దయపైని భార మిడినేర్తుమె కాని, వృథా తపస్సుపైఁ
గా దల పాపపుణ్యములఁ గాదు భవత్కృప గల్గెనేని నా
మోదముతోడఁబాపియునుమోక్షమునొందు ముముక్షుఁడై యొగిన్
నీ దయలేనిచో నరకనిర్ఘరియే గతి గాదె యీశ్వరా !

312

నీవు సతంబు పాపమొనరించుచునుంటివి పుణ్యమెప్పుడున్
భావనచేయఁబోవు ; భగవంతుని భారము పైనె యుంటి వా
దేవుఁడు పాపులన్ దరికిఁ దీయునొ మానునొ ? పాపి పాపియే
గావునఁ బుణ్యకోటి సరిగాఁ డిలఁ బుణ్యులు పుణ్యు లేయెడన్.

313

తపము చేసిన నొక్కటే ; చేయకున్న
నొకటె నీసేవయే శ్రేష్ఠ ముర్వియందు
నీవు నీదయ మాచెడ్డ లెల్లఁబాపి
మమ్ముఁ జరితార్థులను జేసి మనుపు మీశ !