పుట:2015.393685.Umar-Kayyam.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉమర్ ఖయ్యామ్

73

287

ఏను మహాపాపాత్ముఁడఁ
గాన భవత్‌జ్ఞాన మేడ గల్గును ? నేనున్
దీనుఁడ నీ తేజము నా
మానసమునఁ గల్గునే తమస్సయి యుండన్ ?

288

తపసున కుంకువగా నీ
యపవర్గ మొసంగెదేని నది విక్రయమౌ ;
కృప యనఁజెల్ల దు ; నీ కది
యపకీర్తికరంబు గాదె యారయు మభవా !

289

ఏల మదీయ ప్రార్థనము నీమహిమంబున కంటె మించునే
యేల మదీయపాపములు నీ మహనీయత డిందుసేయునే
యేల నిబద్ధుఁ జేయు దిటు లీశ్వర ! వీడుము పెద్దకాలమున్
దాళియె పట్టెదీవు త్వరితంబుగ వీడెదవం చెఱుంగుదున్.

290

నా పాపకథలు దలఁచినఁ
దాపము తలకెక్కి బాష్ప ధారలొలుకు ; న
న్నాపరమాత్ముఁడు పశ్చా
త్తాపమున క్షమించు నంచుఁ దలఁచెదఁ బేర్మిన్.