పుట:2015.393685.Umar-Kayyam.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉమర్ ఖయ్యామ్

71

279

నే నొక లిప్తయేని ధరణీప్రతిబంధము బాయలేదు ; నా
మేను సుఖించుటన్నది నిమేష మెఱుంగను ; పెద్దకాలమున్
దీనత గొల్చినాఁడ నొక తేపయుఁ గాలము నన్ను బోద్ధగాఁ
బూని గ్రహింపలేదు తన ముప్పున దాను పరిభ్రమించుచున్.

280

వసుధన్ వచ్చుట పోవుటన్ గలుగు లాభం బేమి ? మా యాశల
న్వసనంబందునఁ బేకయున్ బడుగు సంభావింపగా లేదొగిన్.
వెసఁ గాలాహతి నీముసుంగున మహావిద్వాంసులే దగ్ధమై
మసియై పోయిరి ; వారిదేహముల ధూమంబైనఁ గాన్పించెనే.

281

హృదయ హస్తంబుపై స్వేచ్ఛ నేగలేదు
ఉత్సుకంబను సురనంట దోష్ఠమునకు
నకట ! మా జీవితేచ్ఛ యిట్లరిగెఁ గాని
యొక్కనాఁడైన సంతోష మొందలేదు.

282

కాంత ! మదాత్మ ప్రేతమున కంటె విహీనత నొందియున్న ; ద
త్యంతము భూమిలో మృతులు హాయిగనుండెద ; రేను దుఃఖ వి
క్రాంతిని రక్తబాష్ప జలరాశిని నా మలినాంబరంబులన్
బంత మెలర్ప క్షాళన మొనర్చిన నైల్యము పోదు దట్టమై.