పుట:2015.393685.Umar-Kayyam.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

ఉమర్ ఖయ్యామ్

267

అరయన్ జందెము సుందరం గుచు నా యంకాన రాజిల్ల సు
స్థిరభక్తిన్ సురశాల కే నరుఁగఁ దచ్చి ష్యుండు నన్ గాంచి, నన్
దఱిమెన్ బొమ్మని యాసురాలయ మపూతంబైన దంచున్ వెసన్
దొరసెన్ బ్రోక్షణఁజేసె మున్నతఁడు నా దుష్కీర్తి నాలించుటన్.

268

కోరిక లాఱిపోయినవి కోమలి ! జాలి వహింపవేమి ? కం
ఠీరవముల్ నశించినవి డిల్ల వడెన్ వనవీధి ? కాల మిం
పారఁగ నెల్ల రాత్రుల సురాసవపాత్రలఁ దొంగిచూచు నేఁ
డారయ వట్టిపాత్రలెకటా ! మనవంతున కున్న వంగనా !

269

కోరికలందు నాయువునె కోల్పడినాఁడ ; ముహూర్తమేని నే
నారయ సౌఖ్యిమం చెఱుఁగ నక్కట ! ముందయినన్ సుఖించి చె
న్నా రెడు నాశలేదు ; భయమయ్యెడు దుర్విధిచేతఁకున్ బ్రతీ
కారము సేయనెంచినను గాలము కాల మొసంగ నేర్చునే.

270

హృదయవీథి నెత్తురు ప్రవహించుచుండె
కనులలోనుండి నెత్తురు కాల్వలయ్యె
క్షతజమును ఱెప్పలురలు టాశ్చర్యమగునె
ముండ్లపొదలనె గద గులాబులు జనించు.