పుట:2015.393685.Umar-Kayyam.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

ఉమర్ ఖయ్యామ్

252

ఏను సురాపణాన నొకవృద్ధునిఁగన్గొని "పోయినట్టి యె
వ్వానినినైనఁ జూచితివె పార్థివ ?" యం చడుగంగ నాతఁడున్
"నే నననేల ? నా వలె ననేకులు పోయిరి మున్ను ; వా రిఁకన్
గానఁగరారు చూవె ! సురగైకొను" మంచును జెప్పె బోద్ధయై.

253

లెమ్ము చషకమ్ము, మధుకలశమ్ముఁ గొమ్ము
పోవుదము చెలి సెలయేటి పొంతలకును
నెట్టిసుందరులకును గాల మెన్ని సార్లు
కలశచషకంబులుగఁ జేయఁ గలిగెనొక్కొ ?

254

గ్రహసప్తంబులు నాల్గుభూతములు నిన్‌గల్పించె ; నీ వీ మహా
మహి జంబాలమునందు జిక్కితివె యీమద్యమ్ముఁగైకొమ్మ ! యీ
విహితం బెన్నియొసార్లు చెప్పితిని నీవిశ్వంబునున్ వీడినన్
మహి కింకెప్పుడు రావు శాశ్వతముగా మాయించు నీయంశమున్.

255

కలుములె గల్గునో, వెతలె గల్గునొ జీవితమందు సౌఖ్యమే
గలుగునొ, లేక దుఃఖములె గల్గునొ యేమని చెప్పనేర్తు ? లో
పనికిని బీల్చుగాలి విడువంబడునో, తెగి యంతరించునో
తెలియదు గాన మద్యమునుదెమ్మిటఁ బాత్రల నింపు నెచ్చెలీ !