పుట:2015.393685.Umar-Kayyam.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

ఉమర్ ఖయ్యామ్

236

ఏమృతి యన్నబీతిఁ బరువెత్తితివేని దళంబురీతి నెం
తే మహి రాలె దాయువను వృక్షమునుండియుఁ ; గాన సంతస
శ్రీ మహి నొప్పి లోకమును జిందఱవందఱఁజేయు మింక ముం
దేమనినో, కులాలకుని యింటను మట్టిగ మాఱకుండఁగన్.

237

తలయున్ దోఁకయు లేని కాలగతికై తర్కించు చెన్నాళ్లు వి
హ్వలవృత్తిన్ వగఁ జెందనేర్తు ? నిలఁ జావన్ దప్ప ; దీచావులో
పల ద్రాక్షరస మిమ్ము ; ముఖ్యమగుభావం బిందులో నున్నదో
లలనా ! వ్యర్థవివాదపద్దతులఁ గాలం బేల పోకార్తువే ?

238

కోయిల కంఠమెత్తి యదె కూయుచు నున్నది ; మత్తకాశినుల్
పోయగ మొప్ప మద్య మిడుచుండిరి ; దానినె పుచ్చుకొమ్ము ; లె
మ్మోయి సఖా ! వనాంత వికచోజ్జ్వలపుష్పములెల్ల నేఁడు రే
పే యటనుండి వేడ్క విహరింపు మటంచు వచించుఁ జూచితే.

239

ఏవగలాడి ! యా రససముజ్జ్వలమౌ చషకంబు నెత్తి తే
వే ! వెస వీనదీతటిని నింపగుశాద్వల వీథులం దొగిన్
ద్రావుద ; మెందఱొ వికచతామరసాక్షుల మ్రింగ యీంగం
బీవిధి భాండపంక్తి సృజియించుఁ దదీయ తనూలతాళిన్.