పుట:2015.373190.Athma-Charitramu.pdf/687

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అనుబంధము 647

శిష్యులలో ననేకులను తనచుట్టును జేరఁదీసి, వారికి ప్రార్థన సమాజ విధులను బోధించుచు, ఆదివారమున స్వగృహమున ప్రార్థనలు జరుపుచుండిరి."

(2)

"గుంటూరు కళాశాలా విద్యార్థి" :_ 15 నవంబరు 1919. గోల్డుస్మితుని "పల్లెటూరి యుపాధ్యాయుఁడు". కే. వి. యస్. శాస్త్రి.

"ఇట్టి పల్లెటూరి యుపాధ్యాయుని తా మెచటనైనఁ జూచిరేమో విద్యార్థులు జ్ఙప్తికిఁ దెచ్చుకొన వలెను. అంత, వారి మన:ఫలకమున, పొడుగు పొట్టియును గానట్టియు, లావుసన్నముగానట్టియు, మధ్యస్థమయిన యాకారమొకటి గానవచ్చును. అతని దుస్తులు నిష్ఠాపూర్వకమగు శ్వేతవర్ణముగలవి. అతని శీలము విరుద్ధగుణ సమ్మేళనము. ఆయన హృదయము దయావైశాల్యములు గల యది. కరుణాళువు. సంతోష ముప్పొంగుచుండువాఁడు. అంతులేని యాతని హాస్యరసము పొంగి పొరలుచుండును. ఆతని ప్రేమ గుణమునకు మితిలేదు. మఱ పెఱుఁగని జాగరూకతకును, సునిశితమగు పరిపాలనా శక్తికిని, ఆయన పేరువడసెను. విద్యార్థులకు భయంకరుఁడు. ఆనంద సంధాయకుఁడు కూడను ! దయాక్రూరత్వము లతనిలో మిళిత మయియున్నవి. తీవ్రశిక్షకుఁడయ్యును, ఆతని తరగతి యెపుడును శబ్దయుతముగ నుండును. ఎవనిమీఁదనైన కోపము వచ్చెనా, పండ్లు కొఱుకుచు, "ఎవఁడురా వీఁడు !" అని గర్జించి, మేజా బల్లమీఁద గ్రుద్ది, అపరాధియగు విద్యార్థిని స్తంభింపఁ