పుట:2015.373190.Athma-Charitramu.pdf/675

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అనుబంధము 633

త్వరలో మీరు ప్రేమాన్వితులగు శ్రీ వీరేశలింగము పంతులుగారి జీవితచరిత్రము ప్రచురింపనున్నారని వినుటకు సంతోషము. నాకు మూఁడుప్రతులు పంపగోరుచున్నాను. ఈవిషయమున మీకు గావలసిన సాయమును సంతోషపూర్వకముగ నేను జేసెదను. అది నాకు విధ్యుక్తము, గౌరవప్రదమును.

చెన్నపురి రాజధానిలోని ఆస్తిక మతప్రచారమునుగూర్చి మద్రాసు బ్రాహ్మసమాజమువారు ప్రచురించిన ప్రణాళికను మీరు చూచియే యుందురు. దానిని గుఱించి మీయభిప్రాయము విపులముగ వినగోరెదను. ఈవిషయమై కొంత పని జరుగవలెనని కోరుచున్నాను.

మీరంపిన 'మనస్తత్వపరిశోధకసంఘము' వారి ప్రచురణము లందుకొన్నాను. జూలైకి ముందుగామాత్రము నా సగము చందా పంపలేననుటకు చింతిల్లుచున్నాను.

మాయమ్మ యధాప్రకారముగనె, మిగుల బలహీనగ మంచము నంటిపట్టుకొనియున్నది. దైవానుగ్రహమువలన మాయమ్మాయి బాగానే యున్నది.

మీసోదరుడు, ర. వెంకటరత్నము.

(9)

రాజ్యలక్ష్మీవిలాసము - పరశువాకము, మద్రాసు, 25. మె. 1902 : _

ప్రియులకు, సంఘ సంస్కరణ మహాసభాధ్యక్షక పదవి వలదని మొదట చెప్పివేసితిని. స్నేహితులు పట్టు పట్టుటచేత, నాకు సందేహము లున్నను తుద కెటులో సమ్మతించితిని. ఇపుడైనను, ఈ గౌరవమునకు నే నర్హుడను గాననియె తలంచుచున్నాను. ఈసభ జయప్రదముగ చేయవలసిన భారమంతయు దేశోద్దారణమును గుఱించి