పుట:2015.373190.Athma-Charitramu.pdf/635

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. తొలిదినములు 595

కారులు నాకపుడు విందొనర్చిరి. విద్యార్థులు వినతిపత్రము సమర్పించిరి. నే నంత గుంటూరునకు బయలుదేఱఁగా, రెయిలులో సుబ్బారాయఁడు నా కగఁబడెను. అతనికి లాయొలా కళాశాలలోఁ జదువును, వాని సోదరుల కందలి వసతిగృహమున భోజనాదికమును సరిపడకపోవుటచేత, మువ్వురు నాచోటు విడిచిపెట్టిరి. సోదరు లిద్దఱు వేఱు బసలోనికిఁ బోఁగా, సుబ్బారాయఁడు తనకుఁ బ్రియమగు రాజమంద్రి కళాశాలలోనే జదువ నిశ్చయించి యిపుడు ప్రయాణమయ్యెను. గుంటూరులో మే మొకనాఁ డాఁగితిమి. అతనిని రాజమంద్రి యంపి, నేను భీమవరము వచ్చితిని.

భీమవరములోఁ గొన్ని దినములకు వెంకటరామయ్య కొమార్తె సీతమ్మ సుఖప్రసవమై మగపిల్లవానిని గనెను. పాప మీమెకదివఱకుఁ గలిగిన యిద్దఱు పిల్ల లును కొంతకాలముక్రిందట చనిపోయిరి. కొన్ని దినము లచట మేము నిలిచి, పిమ్మట గుంటూరు వెడలివచ్చితిమి.

కళాశాలలోనియుద్యోగమును నే నింతటినుండి విరమించుకొనినను, పిమ్మట రెండువత్సరములవఱకును నేను ఇంటరుమీడియెటు పరీక్షాధికారిగనే యుంటిని. అందుచేత నాచేతికిఁ గొంతపనియును, జేబులో కొంత డబ్బును గనఁబడుచుండెను.

ఉద్యోగవిరామము చేసినను, నా కొక్కొకపుడు మనశ్శాంతి యంతగలేకుండెను. నేను గుంటూరులోఁ గట్టించిన "శాంతినిలయ"మను ధర్మాలయము అన్ని విధములగు సభలకు నుపయోగింపవలె నని నేను నిశ్చయించుటచేత, గుంటూరుప్రార్థనసమాజమువా రలుకఁజెంది, అందు తమ సభలు జరుపమని సమ్మెకట్టిరి ! "శాంతినిలయమం"తఁ గొంతకాల మూరకయె యుండెను. వార్తాపత్రికలు పెట్టి యందుఁ జదువుకొనుచుందు మని యొక సమాజమువా రనుటచేత, వారి కందుఁ