పుట:2015.373190.Athma-Charitramu.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 566

                     తే. జీవయాత్రసలిపి జీవితేశ్వరువెంట
                         దివికి నరిగినట్టి భువనసుతకు
                         సీతమాంబికకును మాతల్లి కీకృతి
                         నంకితం బొనర్తు నధికభక్తి.

ఈ సంవత్సరారంభమునుండి నేను తెలుఁగు పత్రికలకు విరివిగ వ్యాసములు వ్రాయ నారంభించితిని. నే నీ 1924 వ సంవత్సరమున "భారతీ" పత్రికకు వ్రాసిన కథలు, "మాణిక్యము", "మాలతి", "నాగరాజు", "కొఱవిదయ్యమును". ఈ కడపటి రెండింటిలోను, చిన్ననాఁడు నే వినినట్టియు, దేశమున వ్యాపించినట్టియు గాథలాధారముగఁ జేకొని కథ యల్లితిని. కాని, మాలతీ మాణిక్యములలోని కథ యామూలాగ్రముగ నా సొంతమె. కథాసందర్భమున దేశీయసాంప్రదాయములను నేను బ్రదర్శింప యత్నించితిని. నవీనాంధ్రదేశమున విద్యాధికుల హృదయసీమల మొలక లెత్తుచుండెడి యాశయములను నే నిందుఁ గనఁబఱచితిని. అనగత్యమగు నీతిబోధనముతోఁ జదువరులను విసివింపక, వారలకు వినోద మొనఁగూర్చుటయె నేను ముఖ్యాశయముగఁ జేసికొంటిని. ఐనను, కొందఱు రచయితల వలె దుర్నీతి కెడమిచ్చెడి యంశములు వర్ణించెడి మాయాకథ లల్లుట నాకు రుచింపదు. చదువరుల మనస్సులకు కథాసంవిధానమందలి వినోదముతోఁబాటు సుగుణజాలమందును, ఉన్నతాశయము లందును నభిరుచి గలిగింపవలె ననియె నా యాశయము.

ఈ కథలు నేను వ్రాయునపుడు, వానిని నా మిత్రులును, నెల్లూరు కళాశాలలో నుపన్యాసకులునునగు శ్రీయుతులు గుఱ్ఱం సుబ్బరామయ్య, దుర్భా సుబ్రహ్మణ్యశర్మగార్లకుఁ జూపించి, భావవిస్ఫురణ భాషాసౌష్ఠవములందు వానిలోఁ గల లోపములను