పుట:2015.373190.Athma-Charitramu.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. నెల్లూరునివాసము: రెండవవత్సరము 555

రించినను లాభము లేకుండెను. నవంబరునెలలో నొకనాఁ డాయన కళాశాల కాలస్యముగ వచ్చి, తాను సకాలముననె వచ్చితి నని చెప్పి, తన సత్యసంధత విషయమై సందియ మందితి నని నామీఁదనె యలుకఁ జెందెను! ఆయనతీరు నాకేమియు బాగుగఁ గనఁబడక, దీనినిగుఱించి తగిన చర్య కై కొనుఁ డని విద్యాలయపాలక వర్గము వారికి విజ్ఞాపన మంపితిని. వా రెటులో మాకు తాత్కాలికసమాధానము కుదిర్చిరి. కాని, పిమ్మట నైనను ఆయన తనలోపములను సవరించుకొన కుండెను.

ఆ డిశంబరు చివరరోజులలో మాచెల్లెలితోను, ఆమె పిల్లలతోను గలసి తిరుపతియాత్ర చేయ మేము సంకల్పించుకొంటిమి. కాని, ఆరోజులలో జరిగెడి నెల్లూరు "మడలప్రాథమిక పాఠశాలోపాధ్యాయుల" ప్రథమసమావేశమునకు నన్నధ్యక్షత వహింపుఁడని యేతాత్సామాజికకార్యదర్శులు కోరుటచేత, యాత్రకు మా యాఁడువాండ్రను పిల్లలను బంపివైచి, నేను పురమున నిలిచి సభాకార్యక్రమము జరిపించితిని. "ఉపాధ్యాయగౌరవపరిరక్షణ" మను శీర్షికగల యుపన్యాసము నే నాసందర్భమునఁ జదివితిని. దానిసార మే మనఁగా, "ప్రాథమికవిద్య జాత్యభివృద్ధికి మూలాధారము. ప్రాథమికపాఠశాలలలో రెండు తరగతులు గలవు. దేశీయ పద్ధతుల ననుసరించి పూర్వపురీతిని విద్య నేర్పెడి బడులు మొదటి జాతిలోనివి. ఈతరగతి విద్యాలయ కార్యక్రమమునఁ గొన్ని మార్పులతో, నూతనోపకరణముల సాహాయ్యమున విద్యాబోధనము నెఱపెడివియె రెండవతరగతి విద్యాలయములు. ఈపాఠశాలలలో బోధకుని కనేక కష్టములు గలవు. అతనికి తగిన జీతము లేదు. బోధనాభ్యసనపాఠశాలలో నతఁడు మొదటఁ గడపవలసిన కాలపరిమితి