పుట:2015.373190.Athma-Charitramu.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 550

బడెను. గుంటూరు కళాశాలలో నే నిచ్చవచ్చినంతకాలము నిలువ వచ్చును. నాజీతముకూడ ప్రోత్సాహకరముగనే యుండెను. కాని, యీక్రైస్తవ విద్యాలయమున నాబోటి హిందువున కెన్నఁడు నధ్యక్షకపదవి సమకూరుట యసంభవము. అందువలననె కదా నేను గొంతకాలముక్రిందట సేలము కళాశాలాధ్యపదవికై ప్రయత్నించితిని. మున్నూఱు మొదలు నన్నూఱు రూపాయిలవఱకును జీతముగల యీ నెల్లూరు కళాశాలాధ్యక్షకోద్యోగమునకుఁ బ్రయత్నింపవలె నని నాకుఁదోఁచెను. నా కిదివఱకు విద్యాలయములందును, కళాశాలలలోనుగల పెక్కేండ్లయనుభవమునుబట్టి నా కీనూతనపదవి లభింపఁగలదని మిత్రులు ప్రోత్సహించిరి. నాదరఖాస్తును స్ట్రాకుదొరగారి సిఫారసుతో నంపివేసితిని. నెల్లూరు విద్యాలయ పాలక వర్గసభ్యులకు మిత్రులచే నన్ను గుఱించి యుత్తరములు వ్రాయించితిని. మిత్రులు నూతనబంధువులునగు శ్రీపోడూరి వెంకయ్యగా రీసమయమున నెల్లూరు జిల్లాకోర్టులో నుద్యోగిగ నుండిరి. నన్నుగుఱించి నెల్లూరు ప్రముఖులకు ఆయన గట్టిసిఫారసుచేసిరి. అంతట, నెల్లూరు వాస్తవ్యులును, విజయనగర కళాశాలలో నుపన్యాసకులు నగు శ్రీమామిడిపూడి వెంకటరంగయ్యగారి కాయుద్యోగమీయఁబడెను. కాని, తమకీ యుద్యోగ మక్కఱలేదని వెంకటరంగయ్యగారు చెప్పివేయుటచేత, ఆపని మరల ఖాళియయ్యెను. ఈమాఱు నేను గట్టి ప్రయత్నము చేసితిని. ఆ యేప్రిలు నెలలో ప్రవేశపరీక్షాధికారుల సభకు నేను మద్రాసు పోయివచ్చుచు నొకదినము నెల్లూరిలో నిలిచి, ఆకళాశాలా పాలకవర్గ సభ్యుల దర్శనము చేసివచ్చితిని. ఈ మాఱు ఆసభవారి కను లిద్దఱిమీఁద బడినట్లు నాకుఁ దెలియవచ్చెను. ఇదివఱ కాపాఠశాలలో ప్రథమోపాధ్యాయలుగ నుండు సంతానరామయ్యంగారికిఁ