పుట:2015.373190.Athma-Charitramu.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 542

శాయన్న పంతులుగారి రెండవ కొమార్తెయును జనిపోయిరని తెలిసి మిగుల విచారము నొందితిమి.

బ్రాడీపేటస్థలమున నేను జిన్న యిల్లు కట్టుట యుక్తమని నాకిప్పటికి నచ్చెను. అక్టోబరు 15 వ తేదీని వెంకటప్పయ్యగారు మా నూతనగృహస్వరూపము కాకితమున గీచినాకుఁ జూపించిరి. మఱునాఁడె మాయింటికి శంకుస్థాపనము జరిగెను. ఇంటికిఁ గావలసిన రాలుతెప్పించుటకును, బావి త్రవ్వించుటకును నే నంత ప్రయత్నములు చేసితిని. ఇంతలో విషజ్వరములు మఱింత ప్రబలుటచేత గుంటూరుకళాశాల పదిదినములు మూసివేయఁబడెను. తననగలు కొన్ని యమ్మివేసి, భార్య నాచేతికి వేయురూపాయి లిచ్చుటచేత, ప్రస్తుతమున వంటయిల్లు ప్రహారి గోడయును గట్టుటకు నేను బూనుకొంటిని.

నవంబరు ప్రారంభదినములలో గుంటూరుపురమున దివ్యజ్ఞాన సమాజసభలుజరిగెను. ఎంతో శ్రమపడి న్యాపతి హనుమంతరావుగారు కట్టించిన దివ్యజ్ఞానసమాజభవనమునకు అనిబిసంటమ్మగారు ప్రవేశ మహోత్సవము సలిపిరి. ఆసందర్భమున నిచ్చిన యుపన్యాసములను బట్టి యానారీమణి శక్తిస్వరూపిణివలెఁ గానవచ్చెను.

టర్కీ ఆస్ట్రియాదేశములు మిత్రమండలిచేఁ బరాజిత మయ్యె నని 5 వ తేదీని వార్తతెలిసెను.

ఈ సంవత్సరమున రాజమంద్రిలో నైనను మంచిటేఁకు చౌకగ దొరకదని మిత్రులు చెప్పిరి. కావున ప్రస్తుత మొక వంట యిల్లే యేర్పఱచుట మంచిదని నాకుఁ దోఁచెను. ఇపుడు బావి త్రవ్వుపని ప్రారంభమయ్యెను. రాలు మొదలగు పరికరములు వచ్చుచుండెను. ఈసమయమున మాస్థలమునకుఁ జేరువుననె నివసించుట