పుట:2015.373190.Athma-Charitramu.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 524

నిపుడు పోటీపడెను. పరీక్షావిజయ విషయమున నన్నుమించిన బంగాళీయువకునికంటె నధికానుభవముగల నాకే యాయుద్యోగమగునని యిపుడు లాహూరునగరము పోయి తన యిద్యోగమునఁ బ్రవేశించిన బంగారయ్య వ్రాసెను. ఎట్టకేలకు నెలకు 275 రూపాయిల జీతము మీఁద నా కాయుద్యోగ మిచ్చిరి. వెంటనె వచ్చి పనిలోఁ బ్రవేశింపుఁ డని యిపుడు పరిచితుఁడైన యచటి కళాశాలాధ్యక్షుఁడు యస్. శి. రాయిగారు నన్నుఁ గోరిరి. నాకు లాహూరుపరిస్థితులు కళాశాలా వ్యవహారములును బాగుగఁ దెలియకుండుటవలన, ఆవిషయమై సవిస్తరమగు నుత్తరము వ్రాయుమని బంగారయ్య నిదివఱకే వేఁడితిని. నా కాతఁడీ ప్రత్యుత్తర మిచ్చెను : -

లాహూరు, 21 - 12 - 1916

"ప్రియమిత్రమా,

"మీరు ప్రశ్నలు తరుచుగ అడుగుచున్నను, సంధిగ్ధములుగా జవాబులువ్రాసి, కాలక్షేపము చేసియున్నాను. ఊరకుండుటకు వీలు లేనందున జవాబు వ్రాయుచున్నాను.

"ఇచట జీతము వృద్ధి అంటే యేమిటో బాగా తెలిసినట్టు కనబడదు. ప్రతి సంవత్సరాంతమున ఉపాధ్యాయుల జీతములు హెచ్చింపబడవు. ఎంతజీతముపైని ఎవరిని తీసికొనివచ్చెదరో, మామూలుగా ఆజీతముమీదనే వాని నుంచెదరు !

"ఉపాధ్యాయుడు గొప్పవాడని విద్యార్థుల మూలముగా తెలియవలెను. విద్యార్థులు ఎంతచెపితే అంత అధికారులు నమ్మెదరు!