పుట:2015.373190.Athma-Charitramu.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 468

అధిక జాగరూకతతో వీక్షించెడి మాతల్లి చక్షువులకు, మాకడగొట్టుచెల్లెలి కనుంగవ నేర్పడిన బాష్పకణములంత పొడగట్టి, బాలికదు:ఖమునకుఁ గారణ మేమని యామె యడిగెను. తా నేడువలె దను చెల్లెలిమాటను గొంతసరిది, సంతోషముననే యుంటిమని నేనంటిని. "మీసంతోషమునకుఁ గారణమే" మను జనని ప్రశ్నమునకు, "నీమంచమునుజుట్టి యుండుభాగ్యము మాకు దొరకినందుకు" అని నేను సమాధానము చెప్పితిని. తనకుఁగోరిక లేవైనఁ గలవాయని మాతమ్ముఁడు కృష్ణయ్య యడుగఁగా, తనకేమియు వాంఛలు లేవని యామె చెప్పివేసెను. కోరికయే పునరావృత్తికి హేతువని నమ్మినది గావున, ఆవనిత వాంఛారహితత్వమున నుండెను. ఆసమయమున నాసుశీల యాత్మ దేవభావమునఁ దేజరిల్లెను. మితభాషిత్వ మామానినికి నైజగుణము. ఆమె నిశ్చలదైవభక్తిగల పుణ్యాంగనయని మాకుఁ దెలియునుగాని, తత్త్వవిషయములందు నట్టియజ్ఞానయనియె మేమనుకొనెడివారము. ఆతరుణమున మాత్రము, అట్లామె గానఁబడలేదు. మరణసమయానుగుణ్యమగు "ముప్పున కాలకింకరులు" అనుదాశరధీశతకములోని పద్యమును, మఱికొన్ని పద్యములు పాటలును ఆమె పాడి, హరినామస్మరణము చేసికొనసాగెను.

"దానధర్మము లేమైన చేసికొనెదవా?" అని మాలో నొకర మడుగఁగా, మా కిష్టమున్న నేదైనఁ జేయవచ్చునుగాని, తన కట్టివానితో జోక్యమిఁక లేదని యామె యనెను. భూలోకజీవితము విడనాడి వెడలిపోవు జీవుని దృష్టిని దానధర్మముల వైపునకైన మరలింపఁదగదని మాయమ్మ మమ్ము వారించెను. వెనుకటి నోములఫలితముగ, తన సంతతి బుద్ధిమంతులు, ప్రయోజకులునై, అవసానసమయమున నిట్లు తనను బరివేష్టించి యుండుటయే మహాసుకృతమని యా