పుట:2015.373190.Athma-Charitramu.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. క్రొత్తప్రదేశము 441

పలుమాఱునాకుఁ బిలుపు వచ్చుచుండెడిది. కావున నిచటికి వచ్చినది మొదలు వ్రాయుటయందేకాక మాటాడుటకును నాకుఁ బ్రోత్సాహము కలుగుచుండెను. ఓడ్రదేశము వచ్చినను వారిభాషనేర్చుకొన నాకభిలాష యేమియులేదు. ఇచటి జనులకందఱికిని తెలుఁగు బాగుగ వచ్చుటయే దీనికొక కారణము. ఎన్ని దేశములు గ్రుమ్మరినను, ఆంధ్రవ్యక్తి సామాన్యముగ కుమ్మరపురుగువలె నన్యభాషాపంకిల మేమియు నంటించుకొనకయే తిరుగుచుండును.

ఈపురమందలి బాలికా పాఠశాలలను బరీక్షించుట కిచటికి విచ్చేసిన గౌకన్యతో నేను బరిచయము కలుగఁజేసికొంటిని. ఆమె మంచి విద్యావతి. నాయందును, 'జనానాపత్రిక' యందును ఆమెకు సుగృద్భావ మేర్పడెను.

సెప్టెంబరునెలలో నే నొకసారి గోదావరిజిల్లా వెళ్లితిని. గోటేటి రామభద్రరాజుగారికి మేము మరల పత్రము వ్రాసి యిచ్చితిమి. కుటుంబమును స్థానము తప్పించినఁగాని మాస్థితిగతులు చక్కఁబడవని మేము నమ్మితిమి. కావున త్వరలో రాజమంద్రి నివేశన మమ్మివేసి, క్రొత్తగ మునసబుకోర్టు పెట్టిన భీమవరమునకు మాతమ్ముఁడు వెంకటరామయ్య వెళ్లునట్లును, తనచదువు తేలువఱకును కృష్ణయ్య యొక్కఁడే రాజమంద్రిలో నివసించునట్లును, మేమేర్పఱుచుకొంటిమి. మాతల్లి నాతో 6 వ సెప్టెంబరున పర్లాకిమిడి చూచి పోవుటకు బయలుదేఱెను.

మఱునాఁడు మేము పర్లాకిమిడి చేరితిమి. తెక్కలి వాస్తవ్యులగు కల్యాపాండాగారను వైద్యశిఖామణి మాముగ్గురకు మందిచ్చుటకు సమ్మతించిరి. నాకు జీతము సంవత్సరమున కైదురూపాయిల