పుట:2015.373190.Athma-Charitramu.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44. "మహలక్ష్మి మరణము" 403

"ఈ మధ్య స్వర్గస్థురాలైన శ్రీమతి మహలక్ష్మి హిందూ సద్వనితలలో నొకతె. * * * చనిపోవువఱకు నీమెకుఁగల బాధలు పలువురి కంతగాఁ దెలియవు. ఈమెహృదయము సముద్రమువలె గాంభీరమైన దని చెప్పవచ్చును. * *

"దేశాచారముచొప్పున నీమెను బాలప్రాయముననే యొక యువకుని కిచ్చి వివాహము చేసిరి. ఆచిన్న వాని విద్యాభివృద్ధి కెన్ని ప్రయత్నములు జరిగినను, తుద కతనికిఁ జదువు లభింపలేదు. * * కొంతకాలమునకు మహలక్ష్మి పతితోఁ గాఁపురము చేయునారంభింపఁగా, వాని యవగుణము లామెకు బోధపడెను ! * * ఆతని దుస్వభావము దుస్సహవాసములమూలమున మఱింత విజృంభించెను. సతిసుగుణము లాతనిమనస్సును ద్రిప్పఁజాలకపోయెను. దుశ్చేష్టల వలనను దుస్సాంగత్యమువలనను అతఁడు తన శరీర సౌష్ఠవమును గోలుపోయి నిరు పేద యయ్యెను. * * మహలక్ష్మి భర్తయెడఁ గొంచెమైనను కోపద్వేషములు వహింపక, అఱుగఁదీసినకొలఁది సువాసన లీను చందనమువలె బాధించు పతియెడ నమితదయతో నొప్పియుండెను.

"మహలక్ష్మి తన భర్తదుర్నయములను గుఱించి చుట్టములతోఁగాని చెలికత్తెలతోఁగాని ప్రస్తావింపదు. * * తన్నాతఁడు ప్రియురాలని భావింపకున్నను, వానికి హితబోధనము చేయుచు, వాని శ్రేయస్సునే కోరుచుండును. ఇదియేకదా నిజమైన పాతి వ్రత్యము !

"మహలక్ష్మి యిపు డీలోకము విడిచిపోయెను. ఎవని లోపములు గప్పిపుచ్చవలె నని యాసుదతి యహర్నిశము ప్రయత్నించెనో, అట్టి భర్తను వీడి తానే ముందుగ పరలోకప్రాప్తిఁ